Nammaku Nammaku (From "Rudra Veena") - (Tamilanda.Net) – (Tamilanda.Net)

Nammaku Nammaku (From "Rudra Veena") - (Tamilanda.Net)

Composers, S.P. Balasubrahmanyam
⬇ Download M4A
⬇ Downloaded 15 times
(0/5)
0 Likes

Lyrics

సీకటమ్మ సీకటి ముచ్చటైన సీకటి
ఎచ్చనైన ఊసులెన్నో రెచ్చగొట్టు సీకటి
నిన్ను నన్ను రమ్మంది కన్నుగొట్టి సీకటి
ముద్దుగా ఇద్దరికే ఒద్దికైన సీకటి
పొద్దు పొడుపేలేని సీకటే ఉండిపోని
మనమధ్య రానీక లోకాన్ని నిద్దరోని
రాయే రాయే రామసిలక
సద్దుకుపోయే సీకటెనక
నమ్మకు నమ్మకు ఈ రేయిని
కమ్ముకు వచ్చిన ఈ మాయని
నమ్మకు నమ్మకు ఈ రేయిని

రే కమ్ముకు వచ్చిన ఈ మాయని
కన్నులు మూసి
మత్తులోన మెత్తగ తోసి
నీ కన్నులు మూసి
మత్తులోన మెత్తగ తోసి
కలలే వలగా విసిరే చీకట్లను
నమ్మకు నమ్మకు ఈ రేయిని

రే కమ్ముకు వచ్చిన ఈ మాయని
వెన్నెలలోని మసకలలోనే

నుకోకు
రవికిరణం కనబడితే తెలియును తేడాలన్ని
నమ్మకు నమ్మకు

రే నమ్మకు నమ్మకు
నువ్వు నమ్మకు నమ్మకు ఈ రేయిని

రే కమ్ముకు వచ్చిన ఈ మాయని
ఆకాశం తాకే ఏ మేడకైన
ఆధారం లేదా ఈ నేలలో
ఆకాశం తాకే ఏ మేడకైన
ఆధారం లేదా ఈ నేలలో
పుడమిని చూడని కన్ను
నడపదు ముందుకు నిన్ను
నిరసన చూపకు నువ్వు ఏనాటికి
పక్కవారి గుండెల నిండా
చిక్కనైన వేదన నిండా
పక్కవారి గుండెల నిండా
చిక్కనైన వేదన నిండా
ఏ హాయి రాదోయి నీవైపు మరువకు

ది నమ్మకు నమ్మకు

రే నమ్మకు నమ్మకు హాహా
నమ్మకు నమ్మకు ఈ రేయిని

రే కమ్ముకు వచ్చిన ఈ మాయని
శీతాకాలంలో ఏ కోయిలైన
రాగం తీసేనా ఏ కాకిలా
శీతాకాలంలో ఏ కోయిలైన
రాగం తీసేనా ఏ కాకిలా
మురిసే పూవులులేక విరిసే నవ్వులులేక
ఎవరికి చెందని గానం సాగించునా
పదుగురి సౌఖ్యం పండే
దినమే పండుగ కాదా
పదుగురి సౌఖ్యం పండే
దినమే పండుగ కాదా
ఆనాడు వసంత గీతాలూ పలుకును కద
మ గసమ దమద నిదని
మమమ మగస
మమమమదమ దదదనిద నినిని
సగసని సని దనిదమదమ
నిసని దస సనిదనిదమ సగ
నమ్మకు నమ్మకు

రే నమ్మకు నమ్మకు
నమ్మకు నమ్మకు ఈ రేయిని
కమ్ముకు వచ్చిన ఈ మాయని
కన్నులు మూసి
మత్తులోన మెత్తగ తోసి
నీ కన్నులు మూసి
మత్తులోన మెత్తగ తోసి
కలలే వలగా విసిరే చీకట్లను
నమ్మకు నమ్మకు ఈ రేయిని

రే కమ్ముకు వచ్చిన ఈ మాయని

Related Songs